Friday, May 10, 2024

జేఈఈ అడ్వాన్స్ డ్‌ షెడ్యూల్‌ విడుదల

spot_img

జేఈఈ అడ్వాన్స్ డ్‌ షెడ్యూ ల్‌ విడుదలైంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో నిర్వహించననున్నట్టు ఐఐటీ మద్రాస్‌ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష ఉంటుందని వివరించింది.

పరీక్ష దరఖాస్తు ప్రక్రియ 2024 ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 30 వరకు  ఉంటుందని తెలిపింది ఐఐటీ మద్రాస్. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మే 6 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2024 మే 17 నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

రెస్పాన్స్ షీట్లను మే 31న వెబ్‌సైట్‌లో పొందుపరచనుండగా.. ప్రాథమిక ‘కీ’ని జూన్‌ 2, తుది ‘కీ’ని జూన్‌ 9న విడుదల చేస్తారు. జూన్‌ 9నే జేఈఈ అడ్వాన్స్ డ్‌ ఫలితాలను విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్‌ -2024 లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అడ్వాన్స్ డ్‌ రాయడానికి అర్హులు. జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30న ముగియనున్నది. జేఈఈ మెయిన్‌ పేపర్‌ 1 వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు, పేపర్‌2 ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 15వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12న ఫలితాలు ప్రకటిస్తారు. జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 10 నుంచి ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి: అమిత్ షా కాదు… అబద్దాల బాద్ షా

Latest News

More Articles