Tuesday, May 7, 2024

కర్ణాటకలా మోసపోవద్దు. భవిష్యత్ అందించే నాయకుడు కేసీఆర్

spot_img

మహబూబాబాద్: కాంగ్రెస్ , బీజేపీ మీటింగ్ లు ఖాళీ కుర్చీలు కనిపిస్తుంటే.. బీఆర్ఎస్ మీటింగ్ లో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. సమైక్య వాదులు ఏకమై తెలంగాణ మీద దండయాత్రకు వస్తున్నారని, తెలంగాణ పౌరుషం దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని కోరారు. మహబూబాబాద్ పట్టణంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ ను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Also Read.. తిరుమల శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా, మెడికల్ కాలేజీ వచ్చేదా?.. తండాలు గ్రామ పంచాయతీలు అయ్యేవా?.. పోడు భూములకు పట్టాలు వచ్చేవా.. ఇవన్నీ సీఎం కేసీఆర్ చేశారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ పోయింది.. స్కాలర్ షిప్స్ రద్దయ్యాయి. కర్ణాటకలా మోసపోవద్దు. రేవంత్ రెడ్డికి కరెంటు మీదే కాదు ఏ అంశం మీద అవగాహన లేదు. బూతులు మాట్లాడే నాయకులు కావాలా.. భవిష్యత్ అందించే నాయకుడు కావాలా? అని ప్రశ్నించారు.

Also Read.. బలిదానాల బాధ్యత కాంగ్రెస్‎దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీనే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పంటలు పడుతున్నాయి. గతంలో కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచి ఉండేవి. కాళేశ్వరంతో కాల్వల నిండా నీళ్లు కనిపిస్తున్నాయి. కరెంట్ వద్దంటే కాంగ్రెస్ గుద్దండి.. రిస్క్ వద్దంటే కారుకు గుద్దండి. కాంగ్రెస్ కర్ణాటకలో కరెంట్ ను 4 గంటలకు తెచ్చింది. 24 గంటలు కరెంట్ కావాలా.. కటిక చీకట్ల కరెంట్ కావాలా ?. కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్థితి ఉండేది. రైతు బంధు విషయంలో ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పిందన్నారు. సోమవారం రోజు మీ ఫోన్ లో టింగ్ టింగ్ మని రైతుబంధు పైసలు పడతాయని పేర్కొన్నారు.

Also Read.. భార్యతో కలిసి స్కూటీపై వ‌చ్చి ఓటేసిన ఎంపీ.. వీడియో వైరల్

రేవంత్ రెడ్డి రైతుబంధును భిక్షంతో పోలుస్తున్నాడు.. రైతుబంధు భిక్షంలా కనిపిస్తుందా?.. రేవంత్ రెడ్డి 69 లక్షల మంది రైతులను అవమానపరిచాడు. ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారు. కాంగ్రెస్ వాళ్లకు ఎప్పుడూ మోసం చేయడమే తెలుసు.. కేసిఆర్ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. సాధ్యమైతే ఎలక్షన్ కమిషన్ అనుమతితో రైతు రుణమాఫీ చేస్తాం.. 14 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఎన్నికల కమిషన్ ఒప్పుకోకుంటే డిసెంబర్ 3 తర్వాత మిగిలిన రైతు రుణమాఫీ నాలుగు వేల కోట్లను మిత్తితో సహా వేస్తామన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే గిరిజన బంధును తప్పకుండా అమలు చేస్తామన్నారు.

Latest News

More Articles