Friday, May 3, 2024

గల్ఫ్ బాధితుల కొరకు ఓ ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తాం. చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేసి చూపిస్తాం

spot_img

కామారెడ్డి జిల్లా : కామారెడ్డికి కేసీఆర్ గారు వస్తున్నారంటే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తున్నాడని కామారెడ్డి ప్రజలు భావిస్తున్నారు. కెసిఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. 14 ఏళ్ళు ఢిల్లీ రాక్షసులతో కొట్లాడి తెలంగాణ తెచ్చిండి. మీ దయ, మీ ప్రేమతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. దేశంలో ఇతర పార్టీ నాయకులు చేయలేని అనేక పనులు చేసి దేశంలోని అగ్రస్థాయి నాయకుడైయుండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కామారెడ్డి బిక్కనూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో కలిసి రోడ్ షో లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. జేఈఈ అడ్వాన్స్ డ్‌ షెడ్యూల్‌ విడుదల

కామారెడ్డిలో, బీక్కనూరులో ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికి పోదు దానికి నాది భరోసా. అసైన్మెంట్ భూములు ఉన్నవారికి మనం గెలిచిన తర్వాత పూర్తి అధికారం అమ్ముకోవడానికి, విక్రయాలు చేసుకోవడానికి పూర్తి అధికారాన్ని కల్పిస్తాం. కామారెడ్డిలో అనేక సమస్యలు పరిష్కారించేందుకు, అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికొస్తే భూములు గుంజుకుంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు. ఈ ప్రాంతంలో గోదావరి నీళ్లు రావాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి. దుబాయ్ కి బొంబాయి కి వలసలు పోవాలి, ఈ ప్రాంత ప్రజలు ఇక్కడే బ్రతకాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తుండు. గల్ఫ్ బాధితుల కొరకు ఓ ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read.. కర్ణాటకలా మోసపోవద్దు. భవిష్యత్ అందించే నాయకుడు కేసీఆర్

కామారెడ్డికి, భిక్కనూరుకు వచ్చి పేద రైతుల భూమిని గుంజుకునే ఉద్దేశం, దుస్థితి మాకు లేదు. భారతదేశంలో 16 రాష్ట్రంలో బీడీలు చుట్టే మహిళలు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో బీడీలు చుట్టే మహిళలకు పెన్షన్ ఇస్తలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఫింషన్ అందజేస్తున్నాం. బీడీలు చుట్టే మహిళలకు పిఎఫ్ ద్వారా పెన్షన్లను అందజేస్తాం. కట్ ఆఫ్ డేటును సడలిస్తాం. డిసెంబర్ 3 తర్వాత జనవరిలో కొత్త పెన్షన్లు అందుతాయి. సౌభాగ్య లక్ష్మి ద్వారా 18 సంవత్సరాల నిండిన మహిళలకు 3000 రూపాయలను అందజేస్తాం. దానిని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తాం 5000 రూపాయలకు పెంచుతాం. డిసెంబర్ 3 తరువాత 1200 రూపాయలు పెంచిన మోడీ సర్కార్ సిలిండర్ ధరను 400 రూపాయలకు తగ్గిస్తాం. అన్నపూర్ణ కార్యక్రమం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతివారికి సన్నబియ్యం అందజేస్తాం. కెసిఆర్ బీమా ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 5 లక్షల జీవిత బీమా అందజేస్తామని పేర్కొన్నారు.

Also Read.. తిరుమల శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

2018లో కొడంగల్ ఓటర్లు రేవంత్ రెడ్డిని తుక్కుతుక్కుగా ఓడగొడితే ఇక్కడికి వచ్చిండు. కొడంగల్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ రేవంత్. తెలంగాణకు జై కొట్టిన మొట్టమొదటి గడ్డ కామారెడ్డి ఇక్కడ నీ వేషాలు చెల్లవు. డిసెంబర్ 3 నాడు డబ్బాలు తెరిచిన తర్వాత కామారెడ్డి సత్తా ఏందో తెలుస్తుంది. రైతుల సమస్యల పట్ల అవగాహన లేకుండా ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు 3 గంటల కరెంటు మాత్రమే చాలని అంటున్నాడు. డిసెంబర్ 3 తర్వాత రైతుబంధును 16 వేల రూపాయలకు పెంచుకుంటున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పట్వారి వ్యవస్థను తీసుకొస్తా అంటుంది. మార్పు, అంటున్న కాంగ్రెస్ నాయకులు ఆరునెలకో ముఖ్యమంత్రి మార్చి మార్పు తెస్తారు. కాంగ్రెసు కొత్తోలేం కాదు గతంలో ఏం చేశారో అన్ని తెలుసు మనకు. 55 ఏళ్లు సతాయించిన దరిద్రం కొట్టు పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.

Also Read.. అభ్య‌ర్ధుల గుణ‌గ‌ణాలు చూసి ఓటు వేయండి

నక్సలైట్ల పేరుతో అమాయకులైన తమ్ముళ్లను చంపిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఆ రాజ్యం మనకు కావాలా దయచేసి ఆలోచించండి. కామారెడ్డిలో ఒక ఇంచు భూమి కూడా ఎవ్వరూ గుంజుకోరు ఆ బాధ్యత నాది. దేశంలో ఉన్న అందరూ లీడర్లు కామారెడ్డికి వస్తారు. కామారెడ్డిలో కేసీఆర్ ని ఓడగొట్టాలి అని కుట్రలు చేస్తున్నారు. సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తది. కామారెడ్డికి భిక్కనూరుకు మంచి రోజులు వచ్చాయి. రేపటి రోజు కామారెడ్డి ప్రజలు గల్లా ఎగురవేస్తారు మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని సగౌరవంగా చెబుతారు. కామారెడ్డి దశ మారేటట్టు, దశాబ్దాల పాటు చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేసి చూపిస్తాం దానికి బాధ్యత నాది. గంప గోవర్ధన్ నా సహకారంతో అభివృద్ధి ముందుకు దూసుకుపోతుంది. కామారెడ్డి ప్రజలు బాగుపడాలంటే, మన బ్రతుకులు మారాలంటే, కామారెడ్డి పొలాలకు నీరు రావాలంటే మన కేసీఆర్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. కామారెడ్డిలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండబోతుందని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles