Saturday, April 27, 2024

తెలంగాణ మీద కుట్ర చేసిన దొంగలందరు ఏకమై వస్తున్నారు జాగ్రత్త

spot_img

సూర్యాపేట : ప్రజా కోర్టులో మరోసారి కాంగ్రెస్ కు భంగపాటు తప్పదని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ , బీజేపీ లు కలిసి కుట్రపూరితంగా ఐటీ , ఈడీ దాడులు చేస్తున్నారని రేవంత్ బహిరంగ లేఖ పై మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో చంద్ర బాబు, మోడీ తరవాత రేవంత్ తయారైయ్యాడని ఆరోపించారు. గోబెల్స్ ప్రచారంలకు సిద్ధహస్తుడైన రేవంత్ కు బిఆర్ఎస్ మీద మజరుగుతున్న ఐటీ ,ఈడీ దాడులు కనపడటం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ అబద్దాలు ఆడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

Also Read.. గల్ఫ్ బాధితుల కొరకు ఓ ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తాం.. కేటీఆర్

బిఆర్ఎస్ కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందన్న మంత్రి, మా అభ్యర్థులకు అన్ని చోట్లా విశేష స్వాగతం లభిస్తోందని అన్నారు. కేసీఆర్ లేకుంటే చీకట్లే అనే నిజాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. దొరలు దేశముఖ్ లే కాంట్రాక్టర్ అవతరమెత్తి కాంగ్రెస్ రూపంలో వస్తున్నారాన్నారు. బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి పేద ప్రజల పొట్ట కొట్టి వారికొచ్చే పథకాలను ఆపే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో లో భంగపాటు తప్పదు అన్నారు. జాతీయ పార్టీలకు సైతం పేదల సంక్షేమం పై సోయి లేదన్న మంత్రి, పేరుకు జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలకంటే హీనంగా తయారైయ్యాయని అన్నారు.

Also Read.. జేఈఈ అడ్వాన్స్ డ్‌ షెడ్యూల్‌ విడుదల

కాంగ్రెస్  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా 24 గంటల విద్యుత్ లేదన్నారు. అన్ని పదకాలను అడ్డుకున్నట్టే ఎన్నికల కమీషన్ ని అడ్డంపెట్టి రైతు బంధుని అడ్డుకున్నారన్నారు. రైతు బంధు అమలుకు కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయం అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పై వాళ్ళకే అనుమానం ఉందన్న మంత్రి.. 6 గ్యారంటీలు వర్క్ ఔట్ కాదనే 42 పేజీల స్కీం లు తెచ్చారని ఎద్దేవా చేశారు. వారి మానిఫెస్టో అమలు సాధ్యం కాదని ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని పేర్కొన్నారు. సంక్షేమం కొనసాగాలంటే కేసీఆర్ ను తెచ్చుకోవాలని ప్రజలు కృత నిశ్ఛయంతో ఉన్నారన్నారు. తెలంగాణ మోడల్ పథకాలు ఎక్కడా లేవన్నారు. తెలంగాణ మీద కుట్ర చేసిన దొంగలందరు ఏకమై వస్తున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Latest News

More Articles