Friday, May 10, 2024

నగ్నంగా ఆస్కార్ వేదికపైకి రెజ్లర్ జాన్ సీనా.!

spot_img

ప్రతిసారి ఆస్కార్ అవార్డుల వేడుకలో ఏదొక హైలైట్ ఉంటుంది. ఈసారి ఉత్తమ కాస్ట్యూమ్ అవార్డును ఆ కీర్తిని దక్కించుకుంది. ఓ సూపర్ స్టార్ నగ్నంగా వేదికపైకి వచ్చాడు. దీని విజేతలను ప్రకటించడం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ హాలీవుడ్ హీరో ఎవరో కాదు..రెజ్లర్ జాన్ సీనా. రెజ్లర్, హాలీవుడ్ నటుడు జాన్ సెనా ఎలాంటి దుస్తులు ధరించకుండా అవార్డును అందజేసేందుకు వేదికపైకి చేరుకున్న నటుడుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నటుడు జాన్ సెనాకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆస్కార్ వేడుకల్లో జాన్ సెనా అవతారంను చూసి ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఆస్కార్ వేడుకల్లో ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. వేదికపై చెప్పుతో కొట్టిన సంఘటన కూడా ఉంది. దీంతో పాటు ఆస్కార్ అవార్డుల్లో పలు విచిత్రాలు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

WWE రెజ్లర్, నటుడు జాన్ సెనా ఆస్కార్ 2024లో నగ్నంగా కనిపించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆస్కార్ వేదికపై జాన్ సెనా పీకేలో అమీర్ ఖాన్ లాగా నగ్నంగా కనిపించి హైలైట్ గా నిలిచాడు.2024 ఆస్కార్స్‌లో కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును అందించడానికి జాన్ సెనా నగ్నంగా వచ్చారు. వేదికపైకి రాకముందు జిమ్మీ కిమ్మెల్ పాత చరిత్రను గుర్తు చేసుకున్నారు.

1974లో ఘటనను వివరిస్తూ…డేవిడ్ నివ్విన్ వేదికపైకి ఎలిజిబెత్ టేలర్ ను ఆహ్వనిస్తుండగా..ఓ వ్యక్తి దిగంబరంగా వేదికపైకి వచ్చాడు. ఆ రోజు ఎవరైనా నగ్నం వేదికపైకి వస్తే ఎలా ఉంటుందో ఊహించారా అని ప్రశ్నించాడు. ఇంతలో వేదిక నుంచి జాన్ సీనా మాటలు వినిపించాయి. దీనికి స్పందించిన జిమ్మీ..అదే పనిలో ఉన్నానంటూ స్పందించారు. ఓ ఎన్వలప్ ను అతడి చేతిలో పెట్టి వేదిక వెనక్కు వెళ్లాడు. దానిని అడ్డుగా పెట్టుకుని జాన్ సీనా నగ్నంగానే వేదికపైకి రావడంతో..అతడిని చూసిన అతిథులు నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

ఇది కూడా చదవండి: శనివారం నాన్ వెజ్ ఎందుకు తినకూడదు..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఇదే.!

Latest News

More Articles