Wednesday, May 1, 2024

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావు

spot_img

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతఅత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణయించినట్టు తెలిపింది.

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతఅప్తి వ్యక్తం చేసిందని వివరించింది.

ఇది కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై మరో కేసు నమోదు

Latest News

More Articles