Sunday, May 5, 2024

ఉన్నఫళంగా హైదరాబాద్‌కు బీఆర్ఎస్ ఎంపీలు

spot_img

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికలపై సీరియస్‌ ఫోకస్ పెట్టారు. మూడు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ.. ఈసారి కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్తుందన్న సంకేతాలతో గులాబీ బాస్ అలర్టయ్యారు. అందుకే, ఢిల్లీలో ఉన్న 16 మంది బీఆర్ఎస్ ఎంపీలను ఉన్నఫళంగా హైదరాబాద్‌కు పిలిపించారు. ఒకరి తరువాత ఒకరితో పర్సనల్‌గా మాట్లాడుతున్నారు. పోగొట్టుకున్న విజయాన్ని తిరిగి దక్కించుకోడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే. పైగా గెలుపు తాలూకు సౌండ్‌ ఐదేళ్ల పాటు రీసౌండ్‌ వచ్చేలా ఉండాలన్నది గులాబీ బాస్ ప్లాన్.

పైగా పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి పార్లమెంట్‌ ఎన్నికలు. ఢిల్లీలో బీఆర్ఎస్ పేరు గట్టిగా వినిపించాలంటే.. తెలంగాణ గల్లీల్లో గట్టిగా కొట్లాడాల్సిందే. అందుకే, వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. రెండు వారాలైనా కాకముందే.. అటాకింగ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పథకాల అమలు ఇంకెప్పుడని ఇరుకునపెట్టే వ్యూహంతో వెళ్తున్నారు. ఇటు పథకాలను అమలుచేస్తూ పాలన కొనసాగించడమా, లేక పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టడమా అనే సందిగ్ధంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేలా అసెంబ్లీ వేదికగా పావులు కదుపుతున్నారు

Latest News

More Articles