Monday, May 6, 2024

మూడోసారి మనమే…ఎవడ్రా మనల్ని ఆపేది.. కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా…ఈఎన్టీవీ ఒపీనియన్ పోల్‎లో వెల్లడి..!!

spot_img

త్వరలోనే రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని సర్వేలన్నీ ఇప్పటికే స్పష్టం చేశాయి. మళ్లీ అధికారం బీఆర్ఎస్ దేనని…సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా అంటూ వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లు ఇప్పటికే మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు డిసైడ్ అయ్యారని…ప్రజాభిప్రాయం ఇదే తీరులో ఉందని Indiatv, Mission Chanakya, Anp సర్వేలు తేల్చి చెప్పాయి. తాజాగా మరో రెండు సర్వేలు కూడా బీఆర్ఎస్ దే అధికారమని ప్రకటించాయి. ఈఎన్టీవీ సర్వేలో బీఆర్ఎస్ 67సీట్ల మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని వెల్లడించింది.

అటు విపక్ష కాంగ్రెస్ మాత్రం 39సీట్లకే పరిమితం కానున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇక బీజేపీ దారుణంగా 6 సీట్లకు మాత్రమే పరిమితం కానుండగా…ఎంఐఎం 7 సీట్లను సాధించే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 20 వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన ENTVఆయా సర్వే ఫలితాలను ఆదివారం రిలీజ్ చేసింది. జిల్లాలావారీగా చూసినట్లయితే అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పై స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలకు 11సీట్లు, మెదక్ లో 7, వరంగల్ 8 చొప్పును సీట్లను కైవసం చేసుకోనుందని వెల్లడించింది. కాగా ప్రముఖసీనియర్ జర్నలిస్టు దినేశ్ కుమార్ ఒపీనియన్ పోల్ లో సైతం బీఆర్ఎస్ 67 నుంచి 74 సీట్లను కైవలం చేసుకోనుందని తేలింది.

పార్టీలవారీగా ఓట్లశాతం:
బీఆర్‌ఎస్‌ 43. 20%
కాంగ్రెస్‌ 32.70%
బీజేపీ 11. 50%
ఇతరులు 12.06%

ఇది కూడా చదవండి: డబ్బు చెట్లకు కాయదు.. ఈ చిట్కాలతో పిల్లలకు డబ్బు ప్రాముఖ్యతను వివరించండి..!!

Latest News

More Articles