Monday, May 6, 2024

రాజాసింగ్ కు బైబై చెప్పండి. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. అభివృద్ధి చూపిస్తా.. కేటీఆర్ సూపర్ స్పీచ్

spot_img

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యేకు గొడవలు పెట్టుకోవడం తప్పా మరే పని లేదు. ఇక్కడి ప్రజల సంక్షేమానికి అతను చేసిందేమి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. మత కల్లోలాలు పెట్టేందుకు ప్రయత్నించిన రాజాసింగ్ ను లోపల వేసింది కూడా సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. గత 10 ఏండ్లలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేకుండా పాలన చేశామన్నారు. మతం, కులం అని చూడకుండా అందరి సంక్షేమానికి బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మూసీలో వేసినట్లేనని తెలిపారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని, ఇక్కడి సమస్యలను తానే స్వయంగా పరిష్కరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి నందలాల్ వ్యాస్ కి మద్దతుగా మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వస్తే ఆగం అవుతాము.. కాంగ్రెస్ చాలా డేంజర్

బలమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం వల్ల హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో కర్ఫ్య్ లేదని, కరువు లేదన్నారు. హిందు ముస్లిం అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్నామని తెలిపారు.  అభివృద్ధి తమ కులం.. సంక్షేమం తమ మతం అనే నినాదంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 2014 లో మోడీ జన్ దన్ ఖాతా తెరిస్తే 15 లక్షలు ఇస్తామని చెవిలో పువ్వు పెట్టాడని విమర్శించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యాక 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు. నెలకు 3 వేల రూపాయలను సౌభాగ్యాలక్ష్మి పథకం కింద మహిళలకు అందిస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. కార్డులు లేని వారికి జనవరిలో కొత్త కార్డులు అందజేస్తామని తెలిపారు.

Latest News

More Articles