Wednesday, May 1, 2024

బీఆర్ఎస్ డిమాండ్ తో మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ

spot_img

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అయితే గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం నానాయాగి చేసింది. ప్రస్తుతం కాఫర్‌ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌ దగ్గర మూడు పిల్లర్లపై కాఫర్‌ డ్యామ్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించబోతోంది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరదలు వచ్చేలోపు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పిల్లర్ల దగ్గర కాఫర్‌ డ్యామ్‌ను కూడా ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఇంతకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని అంతకు ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ తెలిపింది. అయితే.. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందే నిర్మాణ సంస్థనేనని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీంతో ఎల్‌అండ్‌టీ సంస్థ దిగివచ్చి పునరుద్ధరణ పనులు చేపడుతామని ముందుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయం

Latest News

More Articles