Friday, May 10, 2024

టీవీ షోలో ఛాన్స్‌ ఇప్పిస్తానని ఓయో రూమ్‎కు తీసుకెళ్లి..

spot_img

ఒకరి అవసరం మరొకరికి ఆసరాగా మారుతుంది. సినిమాల్లో నటించాలనే కోరికతో పట్నం వచ్చిన యువతులను కొంతమంది కేటుగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇలాగే మోసపోయింది. వెండితెరపై, బుల్లితెరపై కనిపించాలని చాలామంది యువతీ, యువకులు కోరుకుంటారు. అందుకోసం స్టూడియోల చుట్టూ ప్రతి రోజు తిరుగుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అందర్నీ అడుగుతుంటారు. ఇలాంటి వారిని క్యాష్ చేసుకొని కొంతమంది మోసం చేస్తుంటారు. యువకులకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి వారి నుండి డబ్బులు లాగుతుంటారు. ఇక అమ్మాయిలనైతే శారీరకంగా వాడుకుంటుంటారు.

Read Also: ప్రాణాలు తీసిన చలి కుంపటి.. ఊపిరాడక ఐదుగురు చిన్నారులు మృతి

తాజాగా యూసఫ్ గూడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీవీ షోల్లో ఛాన్స్‌ల పేరిట మేకప్ ఆర్టిస్ట్ అయిన యువతిపై లైంగిక దాడి చేశాడు ఓ జూనియర్ ఆర్టిస్ట్. డెమో కోసమని ఓయో రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకొని మరికొన్ని సార్లు వాడుకున్నాడు. ఇప్పుడు మరో అమ్మాయితో కలిసి సదరు మేకప్ ఆర్టిస్ట్‎ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన మధురా నగర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles