Saturday, May 4, 2024

ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్నో చెప్పాల్సిందే: బండి సంజయ్ డిమాండ్.!

spot_img

ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్నో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలంటూ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోపర్యటించిన బండి సంజయ్..పలు వార్డుల్లో ఎంపీ నిధులతో చేపట్టిన డెవలప్ మెంట్ పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే..అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందని బండి వ్యాఖ్యానించారు.

నియోజకవర్గానికి 3,500ఇళ్లు కటిస్తారా అని ప్రశ్నించారు. ప్రజాపాలన సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్ని..మీరు ఇచ్చేవి ఎన్ని..హమీలు నెరవేరస్తారనే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేశారన్నారు. కానీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ మాట మారుస్తోందన్నారు. షరతుల పేరుతో హామీల్లో కోతలు పెడుతోందన్నారు. వెయ్యి మందిని పెళ్లికి పిలిచి 10 మందికే అన్నం పెడతానంంటే ఎలా అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతిలో పరాభవం తప్పదని బండి సంజయ్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక.!

Latest News

More Articles