Tuesday, May 7, 2024

ఓటీటీ ఎంట్రీకి మెగాస్టార్‌ చిరంజీవి రెడీ?

spot_img

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న మెగా 156గా వస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కాగా చిరంజీవికి సంబంధించి ఓ క్రేజీ పుకారు ఫిలింనగర్ సర్కిల్లో రౌండర్ చేస్తోంది. చిరంజీవి తొలిసారి ఓ వెబ్ సరీస్ కు సంతకం చేశాడన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్​లో హింస- ఆరుగురు మృతి..!!

కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుండే చిరంజీవి గతంలో చెప్పినట్లుగానే మంచి స్క్రిప్ట్ దొరకడంతో ఇక డిజిటల్ ఫ్లాట్ ఫాంలో సందడి చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్ పై ఏలుతున్న చిరంజీవి ఓటీటీ ఫ్లాట్ ఫాం ఎలాంటి ఇంప్రెషన్ చూపిస్తాడనేది సర్వాత ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీని 2025 జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ఐఫోన్ 15పై బంపర్ డిస్కౌంట్..త్వరపడండి..ఆఫర్ కొద్దిరోజులే..!!

Latest News

More Articles