Monday, May 6, 2024

శిశు మరణాలకు చెక్.. నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం

spot_img

హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గించేందుకు తెలంగాణ సర్కారు ముందడుగు వేసింది. నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 SNCU (స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్) లను అనుసంధానం చేస్తూ నిలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్ ను  హబ్ గా పనిచేయనుందని మంత్రి తెలిపారు.

‘‘అప్పుడే పుట్టిన శిశువులను బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో నీలోఫర్ ఆసుపత్రి లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారభించుకున్నాం. ఎక్కడో దూరంలో ఉన్న పిల్లలు క్రిటికల్ కేసు లు ఉన్న వారు దారిలోనే చనిపోతున్నారు. అలాంటి పిల్లలు అక్కడే ఉండి ట్రీట్మెంట్ ఇచ్చే విదముగా ఈ సెంటర్ ని ఏర్పాటు చేసాము. ఇక్కడి నుంచి వీడియో లు చూస్తూ వారికీ ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రజలు పట్ల డెడికేటెడ్ గా పని చేసే వైద్యులు నీలోఫర్ లో ఉన్నారు.

ఇలాంటి సెంటర్ భారత దేశంలో ప్రభుత్వ అసూపత్రిలో ఎక్కడ లేదు. సీఎం కేసీఆర్ న్యూట్రషన్ కిట్, కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. అంగన్ వాడి లో ప్రత్యేకముగా పాలు, గుడ్లు అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రము ఏర్పాడక ముంధు ఎస్ ఎన్ సి యు చాలా తక్కువగా ఉండే. 500కోట్లతో ఎమ్సిహెచ్ ని ఆధునికరించడం, కేసీఆర్ కిట్, న్యూట్రషన్ కిట్ లాంటి పధకాలును సీఎం కేసీఆర్  ప్రవేశ పెట్టారు. డెలివరీల సంఖ్య 70 శాతానికి పెరిగింది. 33జిల్లాలలో నియోనాటల్ (neonatal) అంబులెన్సు లును త్వరలోనే ప్రారంభిస్తాం.’’ అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles