Monday, May 6, 2024

అభివృద్ధే అమరులకు అసలైన నివాళి

spot_img

హైదరాబాద్: 10 ఏళ్లలో అడుగు పెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను చాలా ఘనంగా జరిగాయి. నిన్న ఒక్క రోజు అమర జ్యోతి ప్రారంభించి… అమరులకు నివాళులు అర్పిస్తూ వారిని గుర్తు చేసుకున్నాము. అమరులకు అసలైన నివాళి అభివృద్ధి అని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మీడయాతో మాట్లాడారు.

‘‘సామాజిక హౌసింగ్ కింద 15,660 డబుల్ బెడ్ రూమ్ ఆసియాలోనే అతిపెద్దదిగా ప్రారంభించుకున్నాం. దేశంలోనే పెద్దదైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారభించుకున్నాం. అభివృద్ధితోనే అమరుల ఆశయాలు సిద్ధిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ అమరజ్యోతి ప్రారంభం చేసుకున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమే చెబుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం ఎన్నో సందర్భల్లో విజ్ఞప్తి చేసాం. వేగంగా అభివృద్ధి, జాతి నిర్మాణ లో ముఖ్య పాత్ర పోస్టుహిస్తోందని తెలంగాణకు సహకరించాలని కోరాం. ఐదుగురు రక్షణ శాఖ మంత్రులను కనీసం 15,20 సార్లు కలిసాం.

హైదరాబాద్ శరవేగంగా విస్తరణ జరుగుతున్న నగరం. దేశంలో 44% ఐటి ఉద్యోగాలు కల్పిస్తున్న నగరం హైదరాబాద్. గ్లోబల్ వ్యాక్సిన్ హబ్ గా తెలంగాణ నిలిచింది. ఏరో స్పెన్ డిఫెన్స్, పారిశ్రామిక రంగం,ఐటి లో ముందు వరుసలో ఉన్నాం. ఇలాంటి రాష్ట్రానికి మౌలిక వసతుల కోసం సహకరించాలని 9 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. ప్రధాని నుంచి ఐదుగురు రక్షణ శాఖ మంత్రులను కలిసినం. ఇవాళ 4 అంశాలపై విజ్ఞప్తి చేసాం.  కేంద్రం నుంచి ఏ సహాయం అందలేదు. సహకారం ఇవ్వకపోయినా సరే… అభివృద్ధికి అడ్డం పడకండి.

తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ రహదారి ముఖ్యమైనది. దుబ్బాక నుంచి షామిర్ పేట వరకు ఎంత టైం పడుతుందో… షామిర్ పెట్ నుంచి సిటీ లోకి అంత సమయం పడుతోంది. స్కైవేల నిర్మాణం రక్షణ శాఖ భూమి ఇవ్వండి… దానికి సరిపడా భూమి ఇస్తామని చెబుతున్నాం. పాట్నీ సెంటర్ వద్ద 56 ఎకరాల భూమి కావాలి… దానికి సరిపడా భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. డిపిఆర్ కూడా సిద్ధమైంది… అనుమతి స్తే పనులు జరుపుకుంటామని చెబుతున్నాం. మెహదిపట్నంలో స్కై వాక్ కోసం అర ఎకరం డిఫెన్స్ భూమి కొరినం. హైదరాబాద్ మహా నగరానికి 142 లింక్ రోడ్డుల్లో 2, 3 కారిడార్లల్లో రక్షణ శాఖ భూములు అవసరం ఉంది. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.

కంటోన్మెంట్ లో నిరుపయోగంగా ఉన్న లీజ్ భూములు బదలయించాలని కొరినం.అలాంటి భూములు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగంగా ఉంటుంది. కేంద్ర మంత్రి హర్దీప్ పూరిని రేపు మధ్యాహ్నం గం. 3.30లకు కలవబోతున్నాం. హర్దీప్ పూరికి ఇప్పటికే డిపిఆర్ కూడా అందించాం. లక్దికపుల్ నుంచి బీహెచ్ఎల్ వరకు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో కోసం సహాయం అందించాలని కోరాం.

ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ తరపున నిధుల వాటా ఇచ్చాం… అయిన పనులు నత్తనడకన జరుగుతునలన్నాయి. ఎస్ఆర్డీపీ లో భాగంగా 35 అండర్ పాస్ ల నిర్మాణం పూర్తి చేసాం. ఒక్క రసూల్ పురా జంక్షన్ మిగిలింది. అక్కడ 4-5 ఎకరాల భూమి అడిగాము… కేంద్రం నుంచి స్పందన లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్ మెంట్ కోరాం. రసూల్ పురా జంక్షన్ వద్ద భూమి విజ్ఞప్తి చేస్తాం.

మున్సిపల్, రక్షణ, హోంశాఖల మంత్రులను కలుస్తాం. మెరుగునైన రవాణా సదుపాయాలు, స్కై వాక్స్ ఇలా అభివృద్ధి పనులకు సహకారం కోరుతున్నాం. ఇప్పటికైనా ఇస్తే మంచిది… ఇవ్వకపోతే ప్రజల ముందు ఎండగడతాం. లక్నో, బెంగళూరు, అహ్మదాబాద్ లో ఇస్తరు హైదరాబాద్ లో ఇవ్వరు. కామన్ సెన్స్ లేని కారణాలు చెప్పి తప్పించుకుంటా అంటే నడవదు.

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం రూ.300 కోట్ల ఇవ్వాలి తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం మెట్రో పేజ్ 2 కోసం విజ్ఞప్తి చేస్తున్నాం. కాన్పూర్ లో ఎలా ఇచ్చారో… అదే విధంగా మేము అడుగుతున్నాం. కిషన్ రెడ్డి అమాయకత్వం… ప్రజలకు ఇచ్చిన అప్పులను కూడా నిధుల మాదిరిగా చెబుతున్నారు. యూపీ లో 10 మెట్రోల్ కు అనుమతి ఇచ్చి. హైదరాబాద్ కు ఎందుకు సహకరించరు.

గుజరాత్ లో వరదలకు సహాయం అందుతుంది… హైదరాబాద్ కు ఎందుకు అందదు. జాతి నిర్మాణంలో తెలంగాణ ప్రజల పాత్ర ముఖ్యమైనది. వెనుకబడిన బిజెపి పాలిత రాష్ట్రాలకు తెలంగాణ ఆదాయం వెళుతోంది. అందుకు తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పాలి. ప్రజల ఐక్యతను మేము స్వాగతిస్తాం. 75 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా దేశంలో సమస్యలు అలానే ఉన్నాయి. ఇప్పటికి గ్రామాలకు నీరు, కరెంట్ సదుపాయాలు లేవు. కాంగ్రెస్, బిజెపి లే ఇందుకు కారణం. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కావాలి.

చిన్న రాష్ట్రమే అయిన అధ్బుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసుకున్నాం. ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కు అయింది తెలువదా? మేఘాలయాలో బిజెపి, కాంగ్రెస్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కరీంనగర్ లో కాంగ్రెస్, బిజెపి కలిసి పని చేయలేదా? జీవన్ రెడ్డి వంటి నాయకుడు ఉన్నా కాంగ్రెస్ కు డిపాజిట్ రాదా? అత్యంత బలహీనమైన ప్రధాని అని మేము ఏనాడో చెప్పినం.అత్యధిక గ్యాస్ ధరలు, పెట్రోల్, నిరుద్యోగం, రూపాయి పతనం మోదీ నేతృత్వంలోనే జరుగుతున్నాయి.

హైదరాబాద్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పుతాం. ప్రజా, సమైక్య స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే నిర్భయంగా వ్యతిరేకిస్తాం.బిజెపి, కాంగ్రెస్ రెండు దొందు.. దొందే. ఢిల్లీ ఆర్డినెన్స్ కాంగ్రెస్ ఎందుకు మద్దతు చెప్పదు. మేము ఉభయసభలల్లో ఢిల్లీ లో తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తాం.’’ అని కేటీఆర్ తెలిపారు.

Latest News

More Articles