Wednesday, May 1, 2024

ప్రజా కోణంలో ఆలోచించే వారే భవిష్యత్ కోసం పనిచేస్తారు

spot_img

రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసినవి ముందే సీఎం కేసీఆర్ ఏర్పాటుచేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన వనపర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మిషన్ భగీరథ అత్యంత ప్రతిష్టాత్మకమైనది, శాశ్వత ప్రాతిపదికన ఈ నిర్మాణం చేపట్టాం. తాగునీటి కొరత లేకుండా మిషన్ భగీరథ ప్లాంట్స్ నిర్మించాం. నియోజకవర్గంలో 1500 డబుల్ బెడ్ రూమ్‎లు లబ్ధిదారులకు అందించాం. అద్భుతమైన టౌన్ హాల్ నిర్మించి.. సురవరం సాహితీ కళాభవనంగా పేరు పెట్టుకున్నాం. ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్ వెజ్ మార్కెట్ నిర్మించాం. వనపర్తిలో నిర్మించిన మార్కెట్ రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. 76 కోట్ల రూపాయలతో వనపర్తి బై పాస్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రేపు రూ. 48 కోట్ల రూపాయలతో పెబ్బేరు రోడ్డు నిర్మాణానికి, వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో 22 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులకు రేపు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.

Read Also: బాలాపూర్ లడ్డూ తొలి వేలం కేవలం రూ. 450.. 30 ఏండ్లుగా ఎవరెవరు దక్కించుకున్నారంటే?

వనపర్తి జిల్లా ప్రజలకు భవిష్యత్‎కి అవసరమైన పనులు చేపడుతున్నాం. ప్రజల కోణంలో ఆలోచించే వారే భవిష్యత్ కోసం పనులు చేస్తారు. ఆయిల్ పామ్ కంపెనీ నిర్మాణానికి కూడా రేపు శంకుస్థాపన చేస్తారు. మొదటిదశలో 300 కోట్ల రూపాయలతో ప్రైవేట్ కంపెనీ నిర్మాణం చేపడుతోంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. ఏదుల రిజర్వాయర్‎ను కేఎల్ఐకి లింక్ చేస్తాం. వనపర్తిలో ప్రస్తుతం లక్ష ఎకరాల పారుతుంది.. మరో 25 వేల ఎకరాలకు నీరు అందించే పనులు కొనసాగుతున్నాయి. వనపర్తిలో కూడా ఐటి టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నాం’ అని మంత్రి సింగిరెడ్డి తెలిపారు.

Read Also: రికార్డు ధర పలకిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన

Latest News

More Articles