Saturday, April 27, 2024

 కడియం శ్రీహరి పైసల ఆశతో పదవులు తీసుకుని బీఆర్ఎస్ ను మోసం చేసిండు

spot_img

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వందలాది అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ధర్మసాగర్ లో మాట్లాడిన పల్లా…10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్కరినీ కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు. ఉదయం నుంచి బేరసారాలకు దిగుతున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం వస్తోందన్నారు. మాయమాటలతో పార్టీని చీల్చాలని చూస్తే ఊరురా తగిన శాస్తి చెబుతామని హెచ్చరించారు. ముసలి వయసులో.. ముసలి నక్కలాగా ప్రజలను కడియం శ్రీహరి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడివాడివో అయినా స్టేషన్ ఘనపూర్ ప్రజలు అనేకసార్లు నిన్ను ఆశీర్వదించారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కడియం మోసం చేశారన్నారు. సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ చేరిన పార్టీలో నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. మా నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తే ఖబడ్దార్ అని అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే లేని లోటు తీరుస్తా.. కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుతానని అన్నారు.మీ మాయమాటలు, బెదిరింపులకు.. ఉడుత ఊపులకు ఎవరూ భయపడరన్నారు. వచ్చే ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో మాదిగ బిడ్డను గెలిపించుకుందామన్నారు. ఈ ప్రాంత బిడ్డగా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి పని చేస్తా అని అన్నారు పల్లా.

కడియం శ్రీహరిని బీఆర్ఎస్ తరఫున నిలబడితే స్టేషన్ ఘనపూర్ ప్రజలు గెలిపిస్తే .. కుట్రపూరితంగా ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. పైసల ఆశతో పదవులు తీసుకుని బీఆర్ఎస్ ను మోసం చేశారన్నారు. తెలంగాణ అస్తిత్వానికి కడియం శ్రీహరి ప్రమాదకారిగా తయారయ్యాడని..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటకాగుతాడన్నారు.కడియం తన ప్రాంతానికి, తన జాతికి కూడా చేసింది ఏమీ లేదన్నారు. ఎన్ని పదవులు కావాలో అన్ని పదవులు కేసీఆర్ ఇచ్చారన్నారు.

ఇది కూడా చదవండి: మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం

Latest News

More Articles