Saturday, April 27, 2024

పార్టీ మారిన వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం సిగ్గు చేటు

spot_img

కాంగ్రెస్ అధికారం లోకి రాగానే నిండిన చెరువుల్లోకి కప్పలు వెళ్లినట్టుగా వెళ్తున్నారు అని విమర్శించారు దాసోజు శ్రావణ్. ఇవాళ(శుక్రవారం)హైదరాబాద్ తెలంగాణభవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాసోజు…పార్టీ మారిన వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. ఓడ మల్లయ్య.బోడ మల్లయ్య తీరుగా ఉంది కొందరి వ్యవహారం. దానం నాగేందర్ కు బీఆర్ఎస్ లో ఉండగా ఏ ఆత్మగౌరవం దక్కలేదు..?.అన్ని విధాలుగా నాగేందర్ కు బీఆర్ఎస్ లో గౌరవం దక్కింది. రేవంత్ రెడ్డి.. నాగేందర్ ను బీడీలు అమ్ముకునేటోడు అన్నారు ..అంత కన్నా అధ్వాన్నంగా బీఆర్ఎస్ లో ఎవరైనా మాట్లాడారా..? కేటీఆర్.. నాగేందర్ ను ఎప్పుడైనా బీడీలు అమ్ముకునేటోడు అని అన్నారా. కేసీఆర్.. దానం నాగేందర్ ను హెలికాఫ్టర్ లో ఎన్నో సార్లు తన వెంట తీసుకెళ్లారు. నాగేందర్.. కేసీఆర్ కాళ్ళు ఎన్నో సార్లు మొక్కారు. కేసీఆర్ మీద ప్రేమ లేనిదే కాళ్ళు మొక్కారా..ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపరిస్తే కాళ్ళు ఎందుకు మొక్కుతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కేసీఆర్ కు తన ఇల్లు ఇస్తానని నాగేందర్ ముందుకు వచ్చారు.రెండు నెలల్లోనే ఏమైంది ,కేసీఆర్ కు దూరమయ్యావు అని అన్నారు దాసోజు శ్రవణ్. కాంగ్రెస్ కు గతం లో రాజీనామా చేసినపుడు బీసీల ఆత్మగౌరవం దెబ్బ తీసినందుకు అనే కారణం చెప్పారు. రేవంత్ రెడ్డి ఏ సామాజిక న్యాయం పాటిస్తున్నారని ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారు? అని ప్రశ్నించారు. కేశవ రావు, కడియం శ్రీహరి, నాగేందర్ తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ శాసన సభ్యత్వం కచ్చితంగా పోతుందన్నారు. లౌకిక వాదం కోసమే తాను కాంగ్రెస్ లో చేరినట్టు నాగేందర్ చెప్పడం జోక్ అని అన్నారు. 2004 లో టీడీపీ అభ్యర్థిగా బీజేపీ పొత్తుతోనే నాగేందర్ ఎమ్మెల్యే గా గెలిచారనేది మరచిపోవద్దన్నారు. కాంగ్రెస్ ఎక్కువ కష్టాల్లో ఉందని ఆ పార్టీలోకి వెళ్తున్నా అని కేశవ రావు చెప్పడం సరికాదన్నారు.

మా తండ్రి కె .కేశవ రావు బీఆర్ఎస్ ను వీడటం భాధ గా ఉందన్నారు ఆయన కుమారుడు కె .విప్లవ్ కుమార్. ఈ వయసులో కేశవ రావు పార్టీ వీడటం ఏమిటీ ? ఈ కష్టకాలం లో బీఆర్ఎస్ ను వీడటం సరికాదన్నారు.ఇప్పటికైనా మరోసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ లో చేరాలన్న నిర్ణయాన్ని కేకే మార్చుకోవాలన్నారు. ఏవో పదవుల కోసం కేకే కాంగ్రెస్ కు వెళ్తున్నారు అని అనుకోవడం లేదన్నారు. మా సోదరి విజయ లక్ష్మి పార్టీ ద్వారా సంక్రమించిన మేయర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలన్నారు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వీడను అని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం అనేది బూటకమన్నారు. రేవంత్ రెడ్డి మా కుటుంబాన్ని విభజించాలని చూస్తున్నారు అని నేను కూడా అనొచ్చు. మా నాన్న పై విమర్శల వెనక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందనే వాదన అర్థరహితమన్నారు. రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణం చేసినపుడు ఫిరాయింపులను ప్రోత్సహించను అన్నారు..ఇపుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు విప్లవ్ కుమార్.

ఇది కూడా చదవండి:మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం

Latest News

More Articles