Tuesday, April 30, 2024

ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు వచ్చాయని 16 ఏండ్ల మైనర్ ఆత్మహత్య

spot_img

ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటున్నారు. ఏం చేసినా, ఎక్కడికెళ్లినా ఫోటోలు దిగడం, స్టేటస్‎లు పెట్టడం, రీల్స్ చేయడం వంటివి చేస్తుంటారు. అలా రీల్స్ చేసిన ఓ మైనర్ బాలుడు.. కామెంట్లు వ్యతిరేకంగా రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

Read also: రోడ్డు ఊడుస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న కారు.. అక్కడికక్కడే మృతి

ఉజ్జెయినికి చెందిన ప్రన్షు (16) ఓ ట్రాన్స్‌జెండర్. స్థానికంగా ఉన్న పబ్లిక్ స్కూల్‎లో చదువుతున్నాడు. అయితే ప్రన్షు యూట్యూబ్‎లో చూసి మేకప్ నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా నడుపుతున్నాడు. మేకప్ కళ, బ్యూటీ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే.. ఈ వీడియోకు 4,000 ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయని సూసైడ్ చేసుకున్నాడు. విద్వేష కామెంట్ల వల్లే ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నాడని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ఆరోపించాడు. అయితే ప్రన్షు ఆత్మహత్యకు కామెంట్లే కారణమా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉజ్జయిని పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin)

Latest News

More Articles