Monday, May 6, 2024

రికార్డుల సీఎం.. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్‌ కుమార్‌

spot_img

బీహార్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. ఉత్కంఠల నడుమ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాఘట్‌ బంధన్‌కు గుడ్‌బై చెప్పిన నితీశ్‌కుమార్‌.. మళ్లీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

Read Also: కిరాణా షాపుకొచ్చిన తల్లికొడుకులపై దాడి చేసిన వీధి కుక్కలు

243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా మారింది. ఆర్జేడీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌రో వైపు 78 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవ‌లం 45 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. ఈ లెక్క‌న ఆర్జేడీకి ఇంకా 43 మంది స‌భ్యులు అవ‌స‌రం. జేడీయూ-బీజేపీ క‌లిస్తే వారి కూట‌మికి 123 మంది ఎమ్మెల్యేల బ‌లం ల‌భిస్తుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగ‌ర్ స‌రిపోతోంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూకు మద్దతు తెలపడంతో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

నితీశ్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్ఛా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట్‌ చౌదరి, విజయ్‌కుమార్‌ సిన్హా ప్రమాణం చేశారు.

Latest News

More Articles