Sunday, April 28, 2024

తప్పుల తడకగా నూతన ఓటర్ లిస్టులు!

spot_img

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని నూతన ఓటర్ల లిస్టు తప్పులతడకగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది కలవర పెడుతోంది. జిల్లా కలెక్టర్ ఓటర్ జాబితాపై ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న తప్పులు రావడంపై పొలిటికల్ పార్టీలు, ప్రజలు మండిపడుతున్నారు.

Also Read..సీఎం హేమంత్‌ సోరెన్ కు మరోసారి ఈడీ నోటీసులు

తాండూర్ అసెంబ్లీ 56లో తాండూర్ మండలంలోని అతిపెద్ద గ్రామపంచాయతీ అయినా కరణ్ కోట్ గ్రామపంచాయతీ నూతన ఓటర్ లిస్టులో తప్పులు దొర్లాయి.  పోలింగ్ స్టేషన్ 76 జెడ్పీహెచ్ఎస్ నందు సుమారు 100కు పైగా ఓటర్లకు సిర్ర హనుమంతు అని తండ్రి పేరు నమోదు అయింది. అధికారులు ఇప్పటికైనా ఓటర్ లిస్టును సరిచేయాలని కోరుతున్నారు.

Also Read.. ఎమ్మెల్సీలుగా మహేశ్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం

ఇదిలా ఉండగా ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..  ఎమ్మార్వో తారా సింగ్ స్పందించారు. బీఎల్ఓలతో ఓటర్ లిస్టులో ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయో  గుర్తిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఓటర్ లిస్టులో సుమారు 50, 60కు పైగా తండ్రి పేరు సిరా హనుమంతు గా గుర్తించడం జరిగిందని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.

Latest News

More Articles