Thursday, May 2, 2024

రెయిన్ అలెర్ట్: మూడు రోజులపాటు జోరు వానలు

spot_img

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో మయన్మార్‌, బంగ్లాదేశ్‌పైన మేఘాలు ఆవరించి ఉన్నాయని.. ఆదివారం తెలుగు రాష్ట్రాల దిశగా కదులుతున్నాయని పేర్కొంది.దీంతో తెలంగాణలో నల్లగొండ, హైదరాబాద్‌, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఏపీలో సోమవారం కోనసీమ, పశ్చిమగోదావరి, చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

Latest News

More Articles