Saturday, April 27, 2024

తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు అలర్ట్ జారీ.!

spot_img

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి వార్త చెప్పింది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాదు  కొన్ని జిల్లాల్లో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని  వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాలు, జగిత్యాలు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర నుంచి కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆదివారం ఉదయం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట 5 సెంటీమీటర్ల వర్షం నమోదు అయినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: కోహ్లీ సాధించలేనిది..మంధాన సాధించింది.!

Latest News

More Articles