Wednesday, May 1, 2024

రకుల్ ప్రీత్ కొత్త రెస్టారెంట్..ఎక్కడంటే?

spot_img

టాలీవుడ్ హీరోయిర్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరంభ పేరుతో హైదరాబాద్ లో కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఇది వెజ్ రెస్టారెంట్. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రకుల్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్ లో ఎఫ్ 45 పేరుతో జిమ్ లను ఏర్పాటు చేసింది. చాలా మంది స్టార్ హీరోలు ఈ జిమ్ కు వెళ్తుంటారు. మరోవైపు వైల్ బీయింట్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్ లో రకుల్ కు భాగస్వామ్యంకూడా ఉంది. అయితే ఇవే కాదు నేరుగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక ఆరంభం పేరుతో వచ్చని ఈ రెస్టారెంట్ లో మిల్లెట్స్ తో చేసిన వంటకాలు లభించనున్నట్లు సమాచారం.

కాగా రకుల్ ఈమధ్యే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ గోవాలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఇది కూడా చదవండి: శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్..డ్యాన్స్ తో అదరగొట్టిన బాలీవుడ్ స్టార్స్..! 

Latest News

More Articles