Thursday, May 2, 2024

సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ కు ఈసీ వార్నింగ్

spot_img

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ కు భారత ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ ప్రేరేపిత పోస్టులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, పోస్టులను తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఆమోదయోగ్యం కాదంటూనే ‘ఎక్స్’ వాటిని తొలగించింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే వాటిని హోల్డ్ లో పెడుతున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ప్రజాప్రతినిధుల స్పీచ్ లు, పోస్టులను పబ్లిష్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఎక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

భావప్రకటన స్వేచ్ఛకు ‘ఎక్స్’ ప్రాధాన్యం కల్పిస్తుందని… పోస్టులను హోల్డ్ లో పెట్టిన ఖాతాదారులకు ఈ విషయంపై సమాచారం అందించినట్లు ఎక్స్ ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలను ‘ఎక్స్’ లో పబ్లిష్ చేసింది. ఎన్నికల కోడ్ ను అతిక్రమించేలా ఉన్న రాజకీయ పోస్టులను తొలగించాలంటూ ఈసీ జారీ చేసిన హెచ్చరికలను యథాతథంగా పోస్ట్ చేసింది ఎక్స్.

ఇది కూడా చదవండి:  సివిల్స్ లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటడం గర్వంగా ఉంది

Latest News

More Articles