Sunday, April 28, 2024

జపాన్‌లో ఓ పార్టీలో డ్యాన్స్ ఇరగదీసిన సాయిపల్లవి..వైరల్.!

spot_img

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ తోపాటు డ్యాన్స్ లోనూ ఇరగదీస్తుంది. టాలీవుడ్, కోలివుడ్ లో సాయిపల్లవి క్రేజ్ ఎలాంటి అందరికీ తెలిసిందే. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి తొలి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకుంది.తొలి సినిమా విజయంతో సాయి పల్లవి తమిళం, తెలుగు భాషల్లో నటించడం మొదలుపెట్టింది. ఆమె నటించిన చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీని తర్వాత సాయి పల్లవి ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది.

నటుడు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో ఏక్ దిన్ చిత్రంలో నటించేందుకు సాయి పల్లవి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సినిమా షూటింగ్‌ను జపాన్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం పార్టీని జరుపుకుంది. ఇందులో పాల్గొన్న సాయి పల్లవి చిత్రబృందంతో కిక్కిచ్చింది.షూటింగ్ సమయంలో సాయి పల్లవి జపాన్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లి ఎప్పటికప్పుడు తన ఎక్స్ పేజీలో అప్‌లోడ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం జపాన్‌లో చిత్రబృందంతో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: హన్మకొండలో ఘోర ప్రమాదం.. 80గొర్రెలను, కాపరిని ఢీకొట్టిన రైలు

Latest News

More Articles