Saturday, April 27, 2024

వచ్చే మూడురోజులు పెరగనున్న చలి తీవ్రత!

spot_img

హైదరాబాద్: తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. వచ్చే మూడురోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణంలోని మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని తెలిపింది. ఖమ్మంలో 29.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, సిర్పూర్‌లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి -భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు రోజులు ఉదయం వేళల్లో పొగమంచు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.

Latest News

More Articles