Sunday, April 28, 2024

జీ-20 సమావేశాలకు మరో దేశాధ్యక్షుడు డుమ్మా

spot_img

రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సుమారు 30 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొననున్నారు. కాగా.. పలు కారణాల వల్ల ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు ​వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరుకాలేమని ముందుగానే ప్రకటించారు. తాజాగా మరో దేశాధ్యక్షుడు కూడా జీ-20 సమావేశాలకు దూరమవుతున్నాడు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దాంతో తాను ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టంచేశారు. ఆయన స్థానంలో ఉపాధ్య‌క్షుడు న‌దియా కాల్వినో సాంట‌మారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యువ‌ల్ అల్బేర్స్ వస్తారని తెలిపారు.

మరోవైపు.. ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ నేడే హస్తినకు చేరుకోనున్నారు.

Latest News

More Articles