Saturday, April 27, 2024

మాలిలో తిరుగుబాటుదారుల దాడి.. 49 మంది పౌరులతో సహా 15మంది సైనికులు మృతి.!!

spot_img

ఈశాన్య మాలిలో తిరుగుబాటులు దారులు దారుణానికి తెగబడ్డారు. సైనిక శిబిరం, పౌరుల ఓడపై దాడి చేశారు. ఈ ఘటనలో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. ఈ దాడిలో పదులు సంఖ్యలు పౌరులు గాయపడ్డారని… మాలి తాత్కాలిక ప్రభుత్వం జాతీయ టెలివిజన్‌లో తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాకాలంలో గావో, మోప్టి నగరాలు పూర్తిగా వరదకు ప్రభావితం అవుతాయి. ఈ నేపథ్యలో అక్కడ నివసిస్తే పౌరులను ఇతర మైదానా ప్రాంతాలకు తీసుకెళ్తున్న క్రమంలో పడవపై తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు.

మాలి ఈశాన్య ప్రాంతంలోని గావో ప్రాంతం యొక్క పరిపాలనా ఉపవిభాగమైన బౌరమ్ సర్కిల్‌లోని సైనిక శిబిరంపై కూడా దాడి చేశారు. తాత్కాలిక ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఈ సంఘటనలో 50 మంది మరణించారు. అందులో తిరుగుబాటు దారులు కూడా ఉన్నారు. 15 మంది సైనికుల మృతికి సంతాపంగా ప్రభుత్వం 3 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఈ ఘటన ప్రజల్లో భయాందోళనకు గురి చేసింది. అనేక పాశ్చాత్య దేశాలలో మాలి ఒకటి. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌తో ముడిపడి ఉన్న హింసాత్మక తిరుగుబాటులతో దేశం పోరాడుతోంది. దేశంలో స్థానిక దళాలకు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు చేసినప్పటికీ మిలిటెంట్లు సాహెల్, తీరప్రాంత పశ్చిమ ఆఫ్రికా దేశాలలో పట్టు సాధించారు. సహారాకు దక్షిణాన ఉన్న సహేల్ ప్రాంతంలో వేలాది మంది మరణించారు. ఆరు మిలియన్లకు పైగా సాధారణ పౌరులు నిరాశ్రయులయ్యారు. 2020 నుండి మాలిలో రెండు, బుర్కినా ఫాసోలో రెండు సైనిక ఆక్రమణలను ప్రేరేపించింది. కాగా గత 3 సంవత్సరాలలో, పశ్చిమ మధ్య ఆఫ్రికా దేశాలలో 8 తిరుగుబాట్లు జరిగాయి.

Latest News

More Articles