Friday, May 10, 2024

యూట్యూబ్‌లో చూసి ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసిన తెలుగు కుర్రాడు

spot_img

తనకున్న ఇష్టాన్ని పక్కవారికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా యూట్యూబ్‎లో చూసి అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బైకు తయారుచేశాడు. ఏపీలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన మండా దిలీప్ కుమార్ ఇంటర్ పూర్తి చేశాడు. అతనికి మెకానిక్ పనులు చేయడమంటే ఎంతో ఇష్టం. స్కూల్ చదువుతున్న రోజుల్లోనే ఎన్నో తయారు చేసి అవార్డులు అందుకున్నాడు.

Also Read: వేశ్యలను బుక్ చేసుకోవడం.. ఇంటికొచ్చాక చంపేయడం.. కిచెన్‎లో 14 శవాలు

అయితే రోజురోజుకీ పెట్రోల్ ధర పెరిగిపోవడంతో తక్కువ ధరలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బైక్‎ను తయారు చేయాలనుకున్నాడు. యూట్యూబ్‎లో ఎలక్ట్రిక్ బైక్ ఎలా తయారు చేయాలో చూశాడు. అనంతరం ఓ పాత ప్లాటినా బైకును స్క్రాప్‎లో కొనుగోలు చేసి, దానికి బ్యాటరీలు, ఇతర పనిముట్లు ఆన్‎లైన్‎లో కొని, ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు. ఈ బైక్ నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైకు తయారీకి దిలీప్ మొత్తంగా రూ. 17 వేలు మాత్రమే ఖర్చుచేయడ గమనార్హం. ఈ బైక్ మీద ముగ్గురు ఈజీగా ప్రయాణించవచ్చని, తాను ఎక్కడికి వెళ్లినా ఈ బైకునే వాడుతున్నానని దిలీప్ చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ బైకులో ఓ స్పెషాలిటీ కూడా ఉందండోయ్.. ఈ బైకు కేవలం ముందుకు మాత్రమే కాకుండా.. రివర్స్ కూడా వెళ్తుంది.

Latest News

More Articles