Thursday, May 2, 2024

రైతుబంధుపై బ్యాడ్ న్యూస్ ?

spot_img

ఓటేసిన పాపానికి విద్యార్థులకి, రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపెడుతుందా అంటే అవుననే అంటున్నారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతిపై ఒక్కమాటైన చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలని కూడా ముప్పుతిప్పలు పెడుతుంది. డిసెంబర్ 9న రావాల్సిన రైతుబంధు నిధులు ఇప్పటివరకు వేయలేదు. రైతుబంధు సాయం పడిఉంటే ఈపాటికి పంటలు వేసుకునేవాళ్లమని.. మమ్మల్ని సీఎం రేవంత్ నట్టేటా ముంచేశాడని రైతులు ఆవేదన పడుతున్నారు. ఇక అలాంటి రైతులకి మరో షాక్ ఇచ్చింది కాంగ్రెస్ఇ. ఈ నెల కూడా రైతుంబంధు వేయటంలేదని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనవరి నెలలో రైతుబంధు అసాధ్యమని అంటున్నారు.

దీంతో యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారింది. రెండు ఎకరాల భూమి ఉన్న కొద్దిమంది రైతులకు సాయం అందినట్లు తెలుస్తుండగా…. ఎకరం భూమి గల మరి కొందరు రైతులు కూడా తమకు పెట్టుబడి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంకొన్ని నిదులని ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందట. ఐదెకరాలకు మించి విస్తీర్ణం ఉన్న రైతులకు ఫిబ్రవరి ఆఖరిలో చెల్లింపులు చేసే చాన్స్‌ ఉంది. ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తర్వాత నిధులు సర్దుబాటు చేసుకొని మిగిలిన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేలా ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా ఫిబ్రవరి మాసాంతానికి మూడెకరాల వారికీ రైతుబంధు నిధులు పూర్తిగా జమ అయ్యే అవకాశం ఉండగా.. అయిదు ఎకరాల వారికి ఎప్పుడో ఇస్తారో మరి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Latest News

More Articles