Wednesday, May 1, 2024

ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టు షాక్..!

spot_img

ఆర్జీవీ రూటే సపరేటు. జనాలకు నచ్చేలా సినిమాలు తీస్తారు అందరు. కానీ ఈయన తనకు నచ్చితే చాలన్నట్టు సినిమాలను తెరకెక్కిస్తారు. జనాలు చూస్తారా, పొగుడుతారా, లాభాలు వస్తాయా వంటి భయాలేవి లేకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్లే డేరింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మాఫియా, ఫ్యాక్షన్, క్రైమ్, హర్రర్, లేడీస్ ఈ జానర్స్ ఆర్జీవికి ఫెవరెట్. అయితే పొలిటికల్ డ్రామాలను కూడా ఈ మధ్య ఎక్కువగా తీస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నిత్యం వ్యంగ్యంగా సినిమాలు తీస్తున్నారు వర్మ.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యుహం. ఈ మూవీ అనౌన్సమెంట్ నుండి కూడా తీవ్ర వివాదాస్పదం అవుతూ వస్తుంది వ్యూహం చిత్రం. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను తెలంగాణ హైకోర్టు సోమవారం నిలిపివేసింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేసిన కోర్టు, సినిమాను మళ్లీ సమీక్షించి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది.

Latest News

More Articles