Sunday, May 5, 2024

ప్రజాభవన్‌ దగ్గర బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన కారు

spot_img

హైదరాబాద్ ప్రజాభవన్‌  దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్‌ ముందున్న ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత టీఎస్‌13ఈటీ 0777 అనే కారు వేగంగా దూసుకొచ్చి ప్రజాభవన్‌ ముందున్న బారికేడ్లను ఢీకొట్టింది. దీంతో అవి పూర్తిగా ధ్వంసం కాగా.. కారు ముందుభాగం దెబ్బతిన్నది. ప్రమాదం తర్వాత కారు ఆగిన వెంటనే అందులోనుంచి ఓ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కారులో ముగ్గురు యువతులు ప్రయాణించినట్లు గుర్తించారు.

కారును నిర్లక్ష్యంగా నడిపిన అబ్దుల్‌ ఆసిఫ్‌పై పంజాగుట్టా పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు కారును నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘ఆరు గ్యారెంటీల’ పై ప్రజల ఆందోళన.. రేషన్ కార్డు లేకపోతే పథకాలకు దూరమేనా?

Latest News

More Articles