Sunday, May 5, 2024

రైతు బంధు పంపిణీకి తేదీ ఖరారు…మీ అకౌంట్లో నగదు జమకావాలంటే రైతులు ఇలా చేయండి..!!

spot_img

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం నిధులను ఇచ్చేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం 28న ఈ నిధులను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈ డబ్బును యాసంగి సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఇస్తోంది. 28వ తేదీలోపు చెల్లింపులు పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలపడంతో ఒకే రోజులో ఈ పని పూర్తయ్యే విధంగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

77లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం రూ. 7,700కోట్లకు పైగా నిధులను జమ చేయనుంది. ప్రతీ ఏడాది ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్ కు ఎకరానికి రూ. 5వేల చొప్పున రెండు సీజన్ లకు కలిపి మొత్తం రూ. 10వేల రూపాయలను రైతుల అకౌంట్లో వేస్తోంది. ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా యాసంగి సీజన్ కు నవంబర్ లో ఇచ్చే డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అయితే ఇది పాత పథకమే కాబట్టి డబ్బు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రచారం 28తో ముగుస్తుంది. కాబట్టి ఆలోపు నిధుల పంపిణీకూడా పూర్తి కావాలని వెల్లడించింది. 28 తర్వాత నిధుల పంపిణీ చేయోద్దని తెలిపింది. అయితే 25,26,27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండటంతో ప్రభుత్వం 28వ తేదీన డబ్బు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అందుకే రైతులు 28వ తేదీన తమ అకౌంట్లోకి డబ్బు వచ్చిందో లేదో చూసుకోంది. రాకపోతే అధికారులకు సమాచారం అందించండి.

ఇది కూడా  చదవండి: అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలి

Latest News

More Articles