Saturday, April 27, 2024

సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ ఠాక్రే

spot_img

ముంబై: మహారాష్ట్రలో ‘శివసేన’ వివాదం కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజమైన శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గమే అని జనవరి 10న మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తేల్చి చెప్పారు.

స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్దారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించడమని, ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. రాష్ట్రప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించరని వెల్లడించారు. తాజాగా మహారాష్ట్ర స్పీకర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జూన్ 2022లో శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ప్రభుత్వంపై కోపంతో 40 మంది ఎమ్యెల్యేలు అసమ్మతి వర్గంగా ఏర్పడ్డారు. దీంతో అప్పటి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలింది. అనంతరం ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ‘శివసేన’ కోసం ఇరు వర్గాల మధ్య పోరాటం సాగుతోంది.

Latest News

More Articles