Wednesday, May 1, 2024

వెరైటీ డిమాండ్..రైతులకు గంజాయి పండించే పర్మిషన్ ఇవ్వాలంటూ..!!

spot_img

సాగు లాభదాయకంగా లేదు..పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఎంతో మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంటకు మార్కెట్లో ధర లేకపోవడం ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వెరైటీ డిమాండ్ వెలుగులోకి వచ్చింది. గంజాయి పండించేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీలోని విశాఖపట్నంలో జనజాగరణ సమితి డిమాండ్ చేసింది.

ఏపీలో ప్రతిఏటా 15వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు ఏడాదికి రూ. 4లక్షల పెట్టబడి పెడితే రూ. 40లక్షల ఆదాయం వస్తుంది. ప్రపంచంలో రైతులకు అత్యధిక ఆదాయం వచ్చే పంట గంజాయి. ఈ పంట పండించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చి రైతులను అప్పుల బాధల నుంచి బయటపడేయాలని అని కోరింది.

అయితే ఈ డిమాండ్ కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా మంది రైతులు తమకు గంజాయి పండించే అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మహారాష్ట్ర రైతులు ఏకంగా కలెక్టర్ కు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అనుమతి ఇవ్వకుంటే అనుమతులు వచ్చినట్లుగానే భావించి గంజాయి సాగు చేస్తామని అల్టీమేటం కూడా జారీ చేశారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో తెలంగాణ విద్యార్థి పై కత్తితో దాడి…పరిస్థితి విషమం..!!

Latest News

More Articles