Monday, May 6, 2024

నవంబర్‌లో బ్యాంకులు పని చేసేది సగం రోజులే

spot_img

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో అక్టోబర్ నెల ముగిసి.. నవంబర్ నెల ప్రారంభం కానున్నది. ఇప్పుడు లావాదేవీలన్నీ డిజిటల్‌మయమైనా.. ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. బ్యాంకులకు సెలవులు ఏయో రోజుల్లో వస్తాయో తెలుసుకుంటే.. బ్యాంకింగ్ లావాదేవీలు, వ్యవహారాలు సులువుగా చక్కబెట్టుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులకు నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు ఉంటాయి. దీంతోసాటే పండుగలు,  బ్యాంక్ సెలవులు, ప్రాంతీయ, రాష్ట్రాల వారీగా సెలవులు ఉంటాయి. మొత్తంగా నవంబర్ నెలలో 15 రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అయితే, ఈ సెలవు దినాల్లో ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యధాతథంగా పనిచేస్తాయి.

నవంబర్ లో బ్యాంకు సెలవులు ఇవే

  • నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవం, కుట్, కర్వా చాట్ సందర్భంగా కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • నవంబర్ 10న వంగ్లాలా పండుగ సందర్భంగా అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, ఇంఫాల్, కాన్ఫూర్, లక్నో నగరాల్లో సెలవు.
  • నవంబర్ 11-14 మధ్య నాలుగు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవు. 11న రెండో శనివారం, 12న ఆదివారం వారాంతపు సెలవు.
  • 13, 14 తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా అత్యధిక నగరాల్లో బ్యాంకులకు సెలవు.
  • 15వ తేదీన బాయ్ దోజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (దీపావళి/నింగోల్ చాకౌబా/భ్రాత్రిద్వితీయ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో 15న బ్యాంకులకు సెలవు.
  • 20న ఛాత్ పూజ సందర్భంగా బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
  • 23న సెంగ్ కుట్స్ నెమ్, ఈగాస్ బాగ్వాల్ పండుగల సందర్భంగా ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • 27న గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పౌర్ణమి సందర్భంగా సెలవు.
  • 30న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు

సాధారణ సెలవులు

  • నవంబర్ 5: ఆదివారం
  • నవంబర్ 11: రెండో శనివారం
  • నవంబర్ 12: ఆదివారం
  • నవంబర్ 19 : ఆదివారం
  • నవంబర్ 25: నాలుగో శనివారం
  • నవంబర్ 26: ఆదివారం.

Latest News

More Articles