Sunday, May 5, 2024

పర్యావరణపై ప్రభుత్వం ఫోకస్.. ప్రతి జిల్లాకు 2000 వేల మట్టి వినాయక విగ్రహాలు

spot_img

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు మరియు రసాయనాల వినియోగం వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుచున్నాయి. అందుచే కృత్రిమ రంగులు మరియు రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, వరంగల్ వారు రూపొందించిన గోడపత్రికను కలెక్టర్ గారు ఆవిష్కరించారు.

ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షించాలని ఆర్ సునీత తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతి జిల్లాకు 2000 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కావున మట్టి విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని కోరారు. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రజలలో అవగాహన కల్పించటం కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్యనేంద్రన మండలి వారు ఎకో ఫ్రెండ్లీ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 30 తారీకు వరకు http://tspcbquiz.glensserver.com/#/survey-registration లో అధిక సంఖ్యలో విద్యార్థులు నమోదు చేసుకోవాలని కోరారు. కావున పెద్ద సంఖ్యలో విద్యార్థులు పోటీలో పాల్గొనాలని మరియు మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ), EE & AEE, TSPCB, క్వాలిటీ కంట్రోల్ అధికారి సుభాష్ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles