Sunday, May 5, 2024

7,625 కోట్లు ఇచ్చేదెప్పుడు.. దిక్కుతోచని స్థితిలో 39 లక్షల మంది రైతులు

spot_img

కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 40 రోజులు అయిపోయింది. గెలిచిన అనంతరం డిసెంబర్ 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే అదే రోజు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాడు. అయితే ఇప్పటివరకు ఆ పథకం ఊసే ఎత్తడంలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక గత ప్రభుత్వ రైతుబంధు నిదులని కూడా సరిగ్గా విడుదల చేయకుండా కష్టాలు పెడుతుంది. ఇప్పటివరకు నామమాత్రంగా గత ప్రభుత్వ రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ.. రూ.1050 కోట్ల రైతుబంధు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.

తెలంగాణలో రైతు బంధు పథకానికి 68.56 లక్షల మంది రైతులు అర్హులు. వీరిలో 29 లక్షల మంది రైతులకు మనీ వచ్చింది. మిగతా 39 లక్షల మంది రైతులకు మనీ రాలేదు. వీరందరికీ మనీ ఇవ్వాలంటే ఇంకా రూ.7,625 కోట్లు కావాలి. ఈ నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయో లేవో.. ఇస్తారో లేదో దేనికి క్లారిటీ లేదు. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రైతుకి పంట వేయాలంటే ఎకరానికి రూ.15 నుంచి రూ.25వేలు ఖర్చు అవుతుంది. రైతుబంధు వారికి కొంత సహాయం చేసేది. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటంతో బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారు రైతులు. ఫలితంగా వారికి వడ్డీ భారం సమస్య కాబోతోంది.

Latest News

More Articles