Thursday, May 9, 2024

తీరు మార్చుకోని టాలీవుడ్ నటి.. ఆగడాలు శృతిమించడంతో ఫిర్యాదు..!

spot_img

హైదరాబాద్: ఐపీఎస్ అధికారి తో టాలీవుడ్ నటి తగువు పెట్టుకున్నది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే అధికారిక కారును నటి డింపుల్ హయతి తన కారుతో ఢీ కొట్టి నానా హంగామా సృష్టించింది. జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు.

రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ లో డింపుల్ హయతి కాబోయే భర్త డేవిడ్ తన కారుతో ఢీ కొట్టాడు. ఐపీఎస్ అధికారి పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా… డింపుల్ తన తీరు మార్చుకోవడం లేదు. ఆగడాలు శృతిమించడంతో ఫిర్యాదు చేశారు.

రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్.. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదుచేశారు. డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసును కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles