Sunday, May 5, 2024

సీఎం రేవంత్‎తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

spot_img

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో మ‌ధ్యాహ్నం 1.04 గంట‌ల‌కు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తిచేసింది. కాగా.. ఈ రోజు రేవంత్ తో పాటు మరో 11 మంది మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరందరి పేర్లు రాజ్‎భవన్‎కు చేరాయి. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖలతో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

Read Also: సీఎంగా నేడు రేవంత్ ప్రమాణస్వీకారం.. తొలి సంతకం దానిపైనే

కాగా.. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రానున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పలువురు ఏఐసీసీ పెద్దలు, పలు రాష్ట్రాల కీలక నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‎కు చేరుకున్నారు.

Latest News

More Articles