Tuesday, May 7, 2024

సోషల్ మీడియా వేదికగా బోరున ఏడ్చిన అనసూయ

spot_img

ఎప్పుడూ చలాకీగా ఉంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‎గా ఉండే అనసూయ బోరున ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. ‘అందరూ ఆరోగ్యంతో, ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్‌ చూసి మీరందరూ గందరగోళానికి గురవుతారని తెలుసు. నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ అనేవి సమాచార విషయాలని పంచుకునేందుకు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్‌ అవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి, జీవన శైలి, సంస్కృతులను షేర్‌ చేసుకోవడానికి ఇలా పలు విషయాలకు సంబంధించిన సమాచారం కోసమే సోషల్ మీడియా ఉంది. అయితే నిజంగా అదే జరుగుతోందా?

ఈ పోస్ట్‌ ఉద్దేశ్యం ఏంటంటే అన్ని ఫోటో షూట్లు, పోజులు, స్మైల్స్‌, డాన్సులు, బలమైన కౌంటర్లు ఇలా అన్నీ నా జీవితంలో భాగమే. మీరు కూడా అలానే ఉన్నారు. కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటాను. ఇలాగే నా జీవితంలో కొన్ని దశలలో అంత బలంగా లేను, చాలా వీక్‌గానూ ఉన్నాను. నాకు కూడా బ్రేక్ డౌన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎంతటి వారైనా, మామూలు వ్యక్తులైనా అందరికి బాధలు, కష్టాలుంటాయి. జీవితంలో ఇవి అందరికి కామనే. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధని వ్యక్తం చేసేలా గట్టిగా ఏడ్వడంలో తప్పులేదు. బాగా ఏడ్చి, ఆ బాధనంతా బయటకు పంపేసి తిరిగి మళ్లీ మామూలు స్థితికి రావాలి. మళ్లీ స్ట్రాంగ్‌గా కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలి. బాధని వదిలేసేందుకు ఏడ్వడంలో తప్పులేదు. అదే సమయంలో బాధలు, కన్నీళ్లు, కష్టాలు అందరికి ఉంటాయి. అవి ఉన్నప్పుడు రెండు మూడు రోజులు బాగా ఏడ్చి మళ్లీ మామూలు జీవితాన్ని ప్రారంభించాలి. ఎప్పుడూ సవాళ్ల నుంచి భయపడి దూరం పోవద్దు. తిరిగి మరింత బలంగా కమ్‌బ్యాక్‌ కావాలని కోరుకుంటున్నా. నేను ఇప్పుడు పూర్తిగా బాగున్నాను, ఇది నా బ్యాడ్ డేని గుర్తుంచుకోవడానికి 5 రోజుల క్రితం నేను రికార్డ్ చేసిన వీడియో ఇది’ అని అనసూయ చెప్పింది.

https://www.instagram.com/itsme_anasuya/?utm_source=ig_embed&ig_rid=8eee8aa8-236c-444a-a8cf-207c7bf23357

Latest News

More Articles