Wednesday, May 8, 2024

తెలంగాణ సీఎం రేసులో మరో కొత్త లీడర్

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్.. తమ అభ్యర్థుల్ని ప్రకటించి.. రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. కాగా.. బీజేపీ, కాంగ్రెస్‎లు ఇప్పటికీ తమ పూర్తి అభ్యర్థుల్ని ప్రకటించలేకపోయాయి. తమకు సీట్లు రావని భావించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆ పార్టీలను వీడిపోతున్నారు.

ఇకపోతే కాంగ్రెస్‎లో అంతర్గత కుమ్ములాటలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ పార్టీలో ఎవరికి వారే యుమునాతీరే అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఏ లీడర్ కా లీడర్.. నేనే గొప్ప అనే భావనతో దురుసుగా ఉంటారు. ఆ పార్టీలో ఎవరికి వారు నేనే సీఎం అని ప్రకటించుకుంటుంటారు. ఇప్పటికే ఆ పార్టీలో సీఎం రేసులో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానా రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క మొదలైన వారున్నారు. వీరికి ఏ మాత్రం తీసిపోనంటూ మరో లీడర్ ఫ్రేమ్‎లోకి వచ్చారు. ప్రజా ఆశీర్వాదం ఉంటే వచ్చే పదేళ్లలో కచ్చితంగా సీఎం అవుతానంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో సీనియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోయుండేవాడా?

విజయదశమి సందర్భంగా సంగారెడ్డిలో ఉత్సవాల్లో నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నా.. వచ్చే పదేళ్లలో తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతాను. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి.. దీన్ని ఎవరైనా కాదనగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కాంగ్రెస్ నుంచి సీఎం క్యాండిడేట్‎గా మరో లీడర్ వచ్చాడంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read Also: పుట్టిన గంటకే నలుగురు కవలలు మృతి.. బోరుమంటున్న తల్లిదండ్రులు

Latest News

More Articles