Thursday, May 9, 2024

శుభవార్త.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్..!

spot_img

చేవెళ్ల నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎంపి రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్లోల్ల కార్తిక్ రెడ్డి, షాబాద్ జడ్పిటీసి పట్నం అవినాష్ రెడ్డిలు పాల్గొన్న ఈ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ 14 ఎండ్లపాటు కారు ఢిల్లీ వరకు ఉరికింది..తెలంగాణ వ్యాప్తంగా తిరిగింది. ప్రస్తుతం కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయింది. ప్రజలు ప్రతి పక్ష పాత్ర ఇచ్చారు. అందులో బలంగా మన వాణిని వినిపిస్తాము. 2014 నుండి కసిగా పని చేసాము. మీకు పాలించే సత్తా ఉందా అనేవారికి సమాధానం చెప్పే విధంగా పని చేసాము. అందర్నీ సమన్వయం చేయడంలో కొంత లోపం జరిగింది. భయంకరమైన ఓటమి ఏమి జరుగలేదు. 14 సీట్లు దగ్గరలోకి వచ్చి పోయినవి. ఆరున్నర లక్షల మంది వచ్చిన మార్పుపై తిట్టుకుంటూన్నారు.

ఇక ఇప్పటి వరకు రెండు ఎకరాల వరకే రైతుబందు వచ్చింది. రేవంత్ ఇస్తా అన్నా 15 వేలు ఎక్కడా.. 7500 కోట్లు 70 లక్షల మంది రైతులకు అకౌంట్ లలో పడేవి. కాంట్రాక్టర్ లతో మీటింగ్ పెడ్తారు, కానీ రైతులతో మీటింగ్ పెట్టరు. దావోస్ లో పచ్చి అబద్ధాలు మాట్లాడారు రేవంత్ రెడ్డి. రైతు బందు అడిగితే చెప్పుతో కొడ్తాము అని అన్నా కాంగ్రెస్ ను మన ఓటుతో కొట్టి ఇంటికి పంపాలి. గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మేము సపోర్ట్ చేసాము. మొన్న అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ సామాన్య కార్యకర్త మాట్లాడే దానికంటే అధ్వాన్నంగా ఉంది. మన నాయకుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తారు. 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. ఈ హామీలను ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు అనే అడుగుతున్నాము. క్వింటాలుకు 500 వందలు బోనస్ ఇస్తామని అన్నారు. ఎటు పాయె. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి అన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది’ అని అడిగారు కేటీఆర్.

Latest News

More Articles