Sunday, May 5, 2024

ధోనీసేన ఖాతాలో అయిదో టైటిల్‌

spot_img

ఐపీఎల్‌ 2013 16వ సీజన్ కప్ ని చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. సోమవారం టాస్‌ గెలిచిన ధోని బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ ఏకంగా 214 పరుగులు చేయడంతో.. చెన్నై గెల్వడం ఇక కష్టమే అనుకున్నారు. ఆదివారం జరగాల్సిన ఫైనల్‌ను అడ్డుకున్నవరుణుడు..  సోమవారం కీలక సమయంలో మళ్లీ వచ్చి పలకరించాడు.  దీంతో చెన్నై టార్గెట్ ను 15 ఓవర్లు.. 171 పరుగులకు కుదించారు.

నువ్వా నేనా అంటూ సాగిన  మ్యాచ్.. ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాల్సినంత వరకు వచ్చింది. 4 బంతుల్లో వచ్చింది 3 పరుగులే.. దీంతో గుజరాత్ గెలుపు సులువనుకున్నారు అందరూ. అదే కదా క్రికెట్ లో ఉన్న మజా..  అయిదో బంతికి జడేజా సిక్సర్‌ కొట్టి చెన్నైలో ఆశలు పెంచాడు. అదే ఊపులో చివరి బంతిని కూడా బౌండరీ దాటించి చెన్నైకు అయిదో సారి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.  వరుసగా రెండో టైటిల్‌ సాధించాలన్న గుజరాత్‌ ఆశలపై రవీంద్ర జడేజా ఆ విధంగా ‘నీళ్లు’ చట్టాడు. ధోని 42 ఏళ్ల వయసులో ట్రోఫీని అందుకుని కెరీర్ ను చిరస్మరణీయం చేసుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ బ్యాటర్ సాయి సుదర్శన్‌ 96( 47 బంతుల్లో 8×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్‌.. వృద్ధిమాన్‌ సాహా 54 (39 బంతుల్లో 5×4, 1×6), శుభ్‌మన్‌ గిల్‌ 39( 20 బంతుల్లో 7×4) రాణించడంతో 4 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో పతిరన 2/44, దీపక్‌ చాహర్‌ 1/38, జడేజా 1/38 రాణించారు.

బ్యాటింగ్ కు దిగిన చెన్నై 0.3 ఓవర్లలో 4/0తో ఉన్న వరుణుడు పలకరించాడు. దీంతో చెన్నై లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కుదించారు. కాన్వే 47( 25 బంతుల్లో 4×4, 2×6), దూబె 32 నాటౌట్‌( 21 బంతుల్లో 2×6), రహానె 27 (13 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ (3/36), నూర్‌ అహ్మద్‌ (2/17) గొప్పగా బౌలింగ్‌ చేశారు.

Latest News

More Articles