Sunday, May 5, 2024

సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో గులాబీ మయమైన నాగ్‌పూర్‌ పట్టణం

spot_img

హైదరాబాద్: ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలను దృష్టించిన ఆకర్షించిన బిఆర్ఎస్ పార్టీ అదే జోరును కొనసాగిస్తున్నది. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది.  ఇప్పటికే పలుమార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలతో బిఆర్ఎస్ పార్టీ విధానాలను స్పష్టం చేసిన బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరఠ్వాడాలో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు.  ఈ దిశగా నేడు నాగ్‌పూర్‌లో పార్టీ శాశ్వత కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం భారీ సదస్సులో నాగపూర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నరు.

పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో నాగ్‌పూర్‌ పట్టణం మొత్తం గులాబీ మయమైంది. ఎక్కడ చూసిన సీఎం కేసీఆర్‌ చిత్రంతో కూడిన ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’  హోర్డింగ్‌లు, స్వాగతోరణాలు దర్శనమిస్తున్నాయి. నాగ్ పూర్ పట్టణమంతా బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తున్నది.

నాగ్ పూర్ లోని గాంధీబాగ్‌లో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ భవన్‌ను సర్వాంగ సుందరంగా తయారై ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ రాకను ఆహ్వానిస్తూ వేలాదిగా నాగ్ పూర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు భారీ సంఖ్యలో బిఆర్ఎస్  శ్రేణులు ఇప్పటికే చేరుకున్నాయి. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో ఎయిర్ పోర్ట్ పరిసరాలు హోరెత్తుతున్నాయి. కేసీఆర్ ఆగే బఢో హం తుమ్హారే సాథ్ హై ” అంటూ నినదిస్తున్న పార్టీ శ్రేణులు, ప్రజలతో నాగ్ పూర్ పట్టణంలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. కాగా మరి కొద్దిసేపటిలో ప్రగతి భవన్ నుండి  నాగపూర్ పర్యటనకు సిఎం కేసీఆర్ బయలుదేరనున్నారు.

Latest News

More Articles