Friday, May 10, 2024

బాసర త్రిబుల్ ఐటీలో జరిగిన ఘటన చాలా బాధాకరం

spot_img

వికారాబాద్ జిల్లా:  వికారాబాద్ పట్టణంలో ఒక కోటి 70 లక్షలతో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రతి రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాలో లైబ్రరీలకు కొత్త భవనాలను నిర్మించి అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

బాసర త్రిబుల్ ఐటీ లో జరిగిన ఘటన చాలా బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. త్రిబుల్ ఐటీ లో ఏమన్నా సమస్యలు ఉంటే తోటి విద్యార్థులతో పంచుకొని సమస్యలు పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్యలతో తల్లిదండ్రులను తోటి మిత్రులను శోక సముద్రంలో నింపవద్దని మంత్రి అన్నారు. త్రిబుల్ ఐటీ లో జరిగిన ఘటనపై ఒక కమిటీని నియమించామని ఆ కమిటీ ఇచ్చే రిపోర్టును బట్టి చర్యలు ఉంటాయని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఎన్ శుభప్రద పటేల్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుశీల్ గౌడ్ పాల్గొన్నారు.

Latest News

More Articles