Wednesday, May 8, 2024

పదేండ్లలో గెలిచి.. నిలిచిన తెలంగాణ

spot_img

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా జూన్‌ 2వ తేదీ నుంచి మూడు వారాలుపాటు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరుపాలని స్పష్టం చేశారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జూన్‌ 2 నుంచి 22 వరకు ఏ రోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సూచించారు. ఉత్సవాల ఖర్చుల కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేశామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శమైన పాలన చేస్తున్నామని, ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు, విద్యుత్తు, విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ నేడు అత్యద్భుత ఫలితాలను సాధించి.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles