Saturday, April 27, 2024

రోహిణి కార్తె ప్రారంభంలోనే వానకాలం వరినాట్లు వేసుకోవాలి

spot_img

హైదరాబాద్: ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంట దెబ్బతింటున్నదని, ఈ బాధలు తప్పాలంటే నవంబర్‌ 15-20 మధ్య యాసంగి వరినాట్లు వేసుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు సూచించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్టం నేపథ్యంలో రైతులు తమ పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు.

రాష్ట్ర ఏర్పాటు నుంచి వ్యవసాయ రంగ పునరుజ్జ్జీవమే తొలి ప్రాధాన్యంగా కార్యాచరణ మొదలుపెట్టినట్లు సీఎం కేసీఆర్‌ అన్నారు. చెరువులు, విద్యుత్తు, సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేశామన్నారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులను దాటిపోతున్నదని హర్షం వ్యక్తం చేశారు.  కాబట్టి రోహిణి కార్తె ప్రారంభంలోనే వానకాలం వరినాట్లు(మే 25- జూన్‌ 25 వరకు) మొదలు పెట్టాలని సీఎం సూచించారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles