Thursday, May 9, 2024

వచ్చేనెల 24 నుంచి గిరిజనులకు పోడు పట్టాలు.. 1,50,012 మందికి లబ్ది

spot_img

హైదరాబాద్: వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసీ గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,05,601 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేస్తామన్నారు.

మొత్తంగా 1,50,012 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందుతాయని సీఎం తెలిపారు. పోడుభూముల పట్టాలు అందించిన వెంటనే ప్రతి లబ్ధిదారుని పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపిస్తుందని, రైతుబంధును అందజేస్తామన్నారు.

అదేవిధంగా 3.08 లక్షల మంది ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు కూడా రైతుబంధు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ కీలక సమీక్షలో మంత్రులు, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ పాల్గొన్నారు.

Latest News

More Articles